పరివార దేవతలు

                        పరివార దేవతలు
 బృగు మహర్షి అర్ధ నారీశ్వర లింగమును ప్రతిష్టించేను.అగస్త్య ప్రతిస్టితమైన నీలకంఠెశ్వర లింగం,మణికంఠెశ్వరుడు.ఆత్రేయ ప్రతిష్టితుడు.వ్యాస ప్రతిస్టత లింగం ప్రాశస్తమైనది.మర్కేండేయ ప్రతిష్టత లింగం,ప్రతిభా మూర్తి మృతుంజయేశ్వర లింగం. మర్కేండేయని కాలుని బారినుండి రక్షించిన వరమూర్తి సహస్ర లింగేశ్వరుడు,ఇంద్రాది దేవతా ప్రతిస్టతమూర్తి ఇవిగాక సప్త ఋషి ప్రతిస్టతo. రామ పరుశురామ ప్రతిస్టతములైన లింగములు కుడా గలవు.కరువు కటాకంలో మృతుంజేయశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం చేయిoచిన వర్షములు కురియును. కాలభైరవుడు ఇచ్చట క్షేత్రపాలకుడు ఇవిగాక ధర్మరాజు, యమధర్మరాజు,చిత్రగుప్తుల చేత ప్రతిస్టితంలైన లింగములు కలవు.వివిధ గణపతి మూర్తులు సుబ్రమణ్యస్వామి,సూర్య శని గ్రహ మూర్తులు గూడా కలవు. వీరందరూ శ్రీ కాళహస్తిశ్వర స్వామికి పరివార దేవతలై యున్నారు

  శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వరదరాజస్వామి,శ్రీ వీర రాఘవ స్వామి వారలు కుడా ఈ దేవాలయంన గలరు.నిలువెత్తు కన్నప్ప విగ్రహం చూడ గంభీరంగా నుండును. కాశి విశ్వేశ్వరుడు ఇచ్చట వెలసి యున్నాడు. శ్రీ శంకర చార్యుల వారి స్పటిక లింగం ఉదాత్తమైనది. 63 నాయనర్లు లోహ విగ్రహములు కుడా కలవు


                                             మండపములు
 శిల్ప చిత్రకళా ఖండములుగా మండపములు,స్తంభములు,వర్ణ చిత్రములు ఈ దేవాలయంన పెక్కుగలవు.నగరేశ్వర మండపం, గుర్రపు సాని మండపం, నూరు కాళ్ళ మండపం, (రాయల మండపం) పదు నాల్గుకాళ్ళ మండపం, కోట మండపం పెర్ఖోనదగినవి. నూరు కాళ్ళ మండపం ఎంతో శిల్పమయమైనది. పదహారు కాళ్ళ మండపంలోనే 1529 లో శ్రీ కృష్ణ దేవరాయల సోదరుడైన అచ్చుత రాయల  పట్టాభిషేకం మహోత్సవంజరిగింది. కోట మండపం బహు ఉదాత్తమైనది.అమ్మవారి దేవాలయ ప్రాంగణంన అస్త్తోతర లింగ ముఖ ద్వారమున ఫై కప్పులోని చిత్రకళ వైభవం  వర్ణించనలవికాదు. ఆ రంగులు శత శతాబ్దాలుగా ఈనాటి వానివాలే నిత్య నూతనంగా కనబడుచున్నవి

                                  నటరాజ రంగ స్టలము- బ్రహ్మ గుడి

  పల్లవుల నాటి శిల్ప కళ ఖండములకు,చతురస్రాకార సభా మండప  వేదికలకు,నిర్మాణ కౌశల్యంకు ప్రతికములైన చోటు నటరాజ రంగ స్టలము,ఇచ్చట పంచముఖేశ్వరస్వామి విగ్రహం సుందరం అపురూపమైనది.దేవాలయ మాద్యంతంను శిల్పకళమాయం,రాతి దులములు,సహస్రమునకు ఫైగా గల రాతి స్తంభములు అత్యద్భుత మానవ కళా సృష్టికి నిదర్సనములు. దర్సనియములు,కనకదుర్గ చలమునన్నుది. ఈమె వార శృంగార మూర్తి,దసరా శరన్నవ రాత్రుల్లో ఉత్సవములు జరుగును.విద్య క్షేత్రంన శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం ఉన్నదీ.ఇచ్చటనే కుమారస్వామి నారదునికి బ్రహ్మోపదేసం చేసెను.ఆడి కృతిక ఉత్సవం ( ఆషాడ మాసం) ప్రఖ్యాతిగా జరుగును.

                          దేవాలయ పరిపాలక- వసతులు

 దేవాలయంకు పరిపాలన వ్యవస్టగా నొక ధర్మ కర్త్తల మందలి బోర్డు కలదు. దేవాదాయ శాఖలోని ఒక ఉప కమిషనర్ హోదాలో  కార్యనిర్వహణఉద్యోగిగా నియమితులై పరిపాలన జరుపబడుతున్నది. శ్రీ కాళహస్తిశ్వర స్వామి వారి వసతి గృహం, బాలజ్ఞానంబ సత్రం,శంకర ముని వసతి గృహం,త్రినేత్ర నట రాజ వసతి గృహం,శివ సదన్,భరద్వాజ సదన్లు దేవస్తానం అద్వర్యంలో యాత్రికుల సౌకర్యార్ధం గలవు.

No comments:

Post a Comment